ఆసోంలో ఎన్నికలు ముగిశాయి. ఇంకా ఫలితాలు వెలువడలేదు. కానీ అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మహాజోత్ కూటమిలోని ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ( ఏఐయూడీఎఫ్) తమ 22మంది అభ్యర్థుల్ని రాజస్థాన్ జైపుర్‌లోని ఓ హోటల్‌కు తరలించింది. వారందరినీ అటు నుంచి దుబాయ్ పంపిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు.
గెలవకముందే ఫిరాయింపుల భయం- విదేశాలకు అభ్యర్థులు! - అసోం ఎన్నికలు
అసోంలోని మహాజోత్ కూటమిలోని ఏఐయూడీఎఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 22మంది అభ్యర్థుల్ని రాజస్థాన్ జైపుర్‌లోని ఓ హోటల్‌కు తరలించింది. కాంగ్రెస్ కూడా త్వరలో అదే పని చేయనుంది.
ఏఐయూడీఎఫ్
కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల్ని జైపుర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌కు తరలించనున్నట్లు తెలిపింది. పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మహాజోత్ కూటమి అభ్యర్థుల్ని ఇలా తరలిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
ఇదీ చదవండి:అసోం: 377 మంది అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం