రైతులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News).. మరోసారి తన గళం వినిపించారు. దేశంలోని అన్నదాతలు అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. రైతులపై జరుగుతున్న ఈ తరహా క్రూరత్వం... దేశాన్ని నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణా టిక్రీ సరిహద్దులో జరిగిన ట్రక్కు దాడిలో ముగ్గురు మహిళా రైతులు మరణించిన నేపథ్యంలో రాహుల్(Rahul Gandhi News) ఈ మేరకు ట్వీట్ చేశారు.
"మదర్ ఇండియా- దేశంలోని రైతులు నలిగిపోతున్నారు. వారిపై జరుగుతున్న ఈ క్రూరత్వం, ద్వేషం.. దేశాన్ని తొలచివేస్తోంది. అందుకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ హిందీలో చేసిన తన ట్వీట్‌కు FarmersProtest హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
పకోదా చౌక్ ప్రాంతంలో కొంతమంది మహిళలు... బాహుదూర్గఢ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో వారిపై ఓ ట్రక్కు దూసుకెళ్లగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా టిక్రీ సరిహద్దులో జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
వారు హిందువులు కాదు..