బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. నలంద జిల్లాలోని బేనా సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారు. అయితే శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని.. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి - బిహార్ వంతెన ప్రమాదం
బిహార్లో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
under construction bridge collapses in bihar
స్థానికులు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మృతుల్లో తినుబండారాలు అమ్ముకుంటూ వంతెన కింద ఉన్న ఓ చిరు వ్యాపారి ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ కూలిన వెంటనే దాని కింద నలిగిపోయి ఆ వ్యాపారి మృతిచెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Last Updated : Nov 18, 2022, 8:25 PM IST