తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిని వణికించిన 9వ తరగతి విద్యార్థి!

fake phone call
ముంబయి తాజ్​ హోటల్​లో ఉగ్రవాదలు

By

Published : Jun 26, 2021, 4:59 PM IST

Updated : Jun 26, 2021, 7:05 PM IST

16:56 June 26

ముంబయిని వణికించిన 9వ తరగతి విద్యార్థి!

ముంబయి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు ఓ 9వ తరగతి విద్యార్థి. తాజ్​ హోటల్​కు ఫోన్​ చేసిన అతడు.. 'ఇద్దరు ఉగ్రవాదులు హోటల్​లోకి వస్తున్నారు.. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయండి' అంటూ ప్రాంక్​ కాల్​ చేశాడు. దాంతో.. హోటల్​ యాజమాన్యం, పోలీసులు సహా అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 

బాంబు డిటెక్టర్లతో.. 

మధ్యాహ్నం 3:30 గంటలకు తాజ్​ హోటల్ రిసెప్షన్ కౌంటర్​కు సదరు 9వ విద్యార్థి​ ఈ కాల్​ చేశాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు హోటల్​లోకి వస్తున్నారని చెప్పాడని పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు తాజ్​ హోటల్​ వద్ద భారీగా మోహరించారు. బాంబు డిటెక్టర్లు, పోలీసు శునకాలు, బాంబు నిర్వీర్యం చేసే పరికరాలు పట్టుకుని తనిఖీలు నిర్వహించారు.

ట్రేస్​ చేయగా..

అయితే.. ఫోన్ కాల్​ను ట్రేస్​ చేయగా.. మహారాష్ట్ర సతారా జిల్లాలోని కరాడ్​​ నుంచి వచ్చిందని అధికారులు గుర్తించారు. దర్యాప్తు చేయగా.. అది 9వ తరగతి చదివే ఓ విద్యార్థి చేసిన ప్రాంక్​ కాల్​ అని తేలిందని చెప్పారు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.  

2008లో ఉగ్రవాదులు ఇదే హోటల్‌ను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించారు. 26/11 ఉగ్రదాడిగా పిలిచే ఈ ఘటనలో పలువురు విదేశీయులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Last Updated : Jun 26, 2021, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details