తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2020, 7:07 PM IST

ETV Bharat / bharat

'దిల్లీ డిప్యూటీ సీఎంను చంపడానికే భాజపా కుట్ర'

దిల్లీలో ఆమ్​ఆద్మీ, భాజపా మధ్య మాటల తూటాలు పేలాయి. నాయకులు.. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్​, డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాలను చంపడానికి భాజపా కుట్ర పన్నుతుందని ఆప్​ నేతలు ఆరోపించారు. అందుకే సిసోడియా ఇంటిపై 'భాజపా గూండాలు' దాడి చేశారని దుయ్యబట్టారు. వీటిని భాజపా శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

Amit Shah wants to kill delhi CM-Deputy CM said AAP
'దిల్లీ డిప్యూటీ సీఎంను చంపడానికి భాజపా కుట్ర'

దిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని చంపడానికి అమిత్​ షా కుట్ర పన్నుతున్నారని ఆమ్​ఆద్మీ పార్టీ(ఆప్​) నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై భాజపా గూండాలు దాడి చేశారని ధ్వజమెత్తారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం అరవింద్​ కేజ్రీవాల్.

"సిసోడియా ఇంటిపై వ్యవస్థపూర్వకంగా పక్కా ప్రణాళికతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన లేని సమయంలో పోలీసుల సమక్షంలో గూండాలు ఇంటిలోకి ప్రవేశించారు. దిల్లీలోని భాజపా శ్రేణులు రోజురోజుకూ ఎందుకు అంత నిరాశ చెందుతున్నాయి"​ అంటూ ట్వీట్​ చేశారు కేజ్రీవాల్​.

బ్లాక్​ డే..

సిసోడియా ఇంట్లోకి బలవంతంగా వెళ్లిన గూండాలను ఆపడానికి పోలీసులు కనీసం ప్రయత్నించలేదని ఆప్​ ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​ ఆరోపించారు. భాజపా గూండాలకు పోలీసులు సహకరించారని దుయ్యబట్టారు. దిల్లీ రాజకీయ చరిత్రలో 'బ్లాక్​ డే'గా అభివర్ణించారు మరో ఆప్ ప్రతినిధి. అమిత్​ షా.. తన పార్టీ గూండాలను ఉపయోగించి ఆప్​ నేతలు, వారి కుటుంబాలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు.

అందుకే ఇలా..

అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు దిల్లీ భాజపా ఉపాధ్యక్షుడు అశోక్​ గోయల్​​. మేయర్​ సహా ఇతర కార్పొరేటర్లను చంపేందుకు అధికార పార్టీనే కుట్ర పన్నిందని, దానిని తప్పుదోవ పట్టించడానికే ఆప్​ ఈ ఆరోపణలు చేస్తుందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ధర్నా చేపట్టిన మేయర్​ సహా ఇతర కార్పొరేటర్లను చంపేందుకు అధికార పార్టీ కుట్ర పన్నుతోందనే ఆరోపణలతో.. సిసోడియా నివాసానికి సమీపంలో నిరసన ప్రదర్శన చేశాయి భాజపా శ్రేణులు.

ఇదీ చూడండి:నడ్డాపై దాడి- భాజపా, టీఎంసీ మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details