ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుర్ల నుంచి ఏడుగురు రోగులతో కటక్ వెళుతున్న అంబులెన్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. జాతీయ రహదారి55పై జరపద చక్క్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అంబులెన్సును ఢీకొట్టిన ట్రక్కు- నలుగురు మృతి
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. రోగులతో వెళుతున్న అంబులెన్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రక్కు, అంబులెన్సు ఢీ- 4మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్టు మార్టంకు పంపించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కును సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:బాలికపై గ్యాంగ్ రేప్- దోషులకు 20 ఏళ్ల జైలు