పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్(Captain Amarinder Singh).. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు(Amarinder Singh new party). పంజాబ్ ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. (Amarinder Singh news) రాష్ట్రంలో భాజపాతో పొత్తుపెట్టుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రైతుల సమస్య పరిష్కారమైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. కలిసొచ్చే పార్టీలతోనూ జట్టు కట్టేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
'కెప్టెన్' కొత్త పార్టీ.. భాజపాతో పొత్తుకు సై.. - అమరిందర్ సింగ్ భాజపా న్యూస్
పంజాబ్లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(Captain Amarinder Singh).. పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భాజపాతో పొత్తుకూ సిద్ధమేనని ప్రకటించారు. కలిసొచ్చే పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామన్నారు. (Amarinder Singh new party).
అమరిందర్ సింగ్
ఇటీవలే కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు అమరిందర్ సింగ్. భాజపాలో చేరుతారని అప్పుడు ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిని అమరిందర్ ఖండించారు. భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో కొనసాగేదీ లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 20, 2021, 6:36 AM IST