ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh news). పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను (Navjot Singh Sidhu news) ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి (Punjab CM name) కానివ్వకుండా పోరాడతానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై గట్టి అభ్యర్థిని నిలబెడతానని ప్రకటించారు.
ఇలాంటి ప్రమాదకారి నుంచి దేశాన్ని కాపాడేందుకు.. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని సిద్ధూను(Navjot Singh Sidhu news) ఉద్దేశించి వ్యాఖ్యానించారు అమరీందర్(Captain Amrinder Singh).
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ఆ కుటుంబంపై స్పందించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పెద్దగా అనుభవం లేని నేతలని, వారి సలహాదారులే ఇరువురినీ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ మేరకు అమరీందర్ (Amarinder Singh news) కార్యాలయం పేర్కొంది.
''ప్రియాంక, రాహుల్ గాంధీ.. నాకు పిల్లలతో సమానం. ఈ బంధం ఇంతటితో ఆగిపోదు. నాకు చాలా బాధగా ఉంది. ఇద్దరికీ పెద్దగా అనుభవం లేదు. వారి సలహాదారులే పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు.''
- అమరీందర్ సింగ్ కార్యాలయం
సోనియాకు మూడు వారాల కిందే రాజీనామాకు సిద్ధమని అమరీందర్ చెప్పారని, అయితే ఆమె కొనసాగాలని చెప్పినట్లు కెప్టెన్ కార్యాలయం వెల్లడించింది.