Aligarh Rape Case Filed After 32 Years : నాన్న తర్వాత నాన్నంతటి వాడు చిన్నాన్న! అలాంటి వ్యక్తే కూతురు సమానురాలైన అమ్మాయిపై సుమారు 32 ఏళ్ల నుంచి బెదిరించి బలత్కారానికి పాల్పడుతున్నాడు. ఈ దుశ్చర్య మొదలైనప్పుడు ఆ పాప వయసు 11 ఏళ్లు. లోకం పోకడలు అంతగా ఎరుగని ఆ పాపపై తన ఇంట్లో వారే బలాత్కారానికి పాల్పడితే ఆ మాట ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయేది.
ఆఖరికి ఆమెకు పెళ్లయ్యాక అయినా ఈ బాధనుంచి విముక్తి లభిస్తుందని ఆశ పడింది. కానీ అలా జరగలేదు. పుట్టింటికి చుట్టం చూపుగా వెళ్లినప్పుడు మళ్లీ ఆ కామాంధుడు ఆమెను బలవంతపెట్టేందుకు ప్రయత్నించాడు. ఈసారి ధైర్యం చేసి తిరగబడితే దాని ఫలితం ఆమెకు దెబ్బల రూపంలో దక్కింది. ఈ విషయాన్ని బయటపెడితే తన భర్తకు చెప్తామని బెదిరించడం వల్ల ఆమె నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె బాధను తెలుసుకుందామని తన భర్త ఆమెతో మాట్లాడగా అసలు విషయం బయటపెట్టింది. విషయం విన్న భర్త ఆమెకు భరోసా ఇచ్చి కంప్లైంట్ చేయమని ప్రోత్సహించాడు. దీంతో ఆ దుర్మార్గుడి అరాచకాలకు అడ్డు చేప్పినట్లు అయ్యింది.
అసలేం జరిగిందంటే:
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఓ మహిళ తనపై గత 32 ఏళ్లుగా తన ఇంట్లోని ఓ వ్యక్తి బలాత్కారానికి పాల్పడుతున్నాడని అలీగఢ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన చిన్నాన్నే ఈ దారుణానికి ఒడిగట్టాడని కంప్లైంట్ ఇచ్చారు. 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఆ క్రమంలో తనకు కడుపు నొప్పి వచ్చిందని.. తల్లికి చెప్తే ఆమె ఓ మాత్ర ఇచ్చి ఊరుకోమందని వివరించింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఇదే అదునుగా చేసుకుని దాదాపు ఆ అమ్మాయికి పెళ్లయ్యేంతవరకు ఇలానే ప్రవర్తించేవాడు.
కాగా, 2011లో ఆ యువతికి అలిగఢ్‌లోని ఓ జవాన్‌తో వివాహం జరిగింది. వివాహం తరువాత అంతా సజావుగా సాగుతుందని అనుకున్న ఆ బాధితురాలికి నిరాశే ఎదురైంది. పుట్టింటికి వెళ్తావా అని భర్త అడిగిన ప్రతి సారి ఆమె భయంతో నిరాకరించేది. 2019లో ఓసారి తన సోదరుడితో కలిసి ఇంటికి వెళ్లగా.. వాళ్ల చిన్నాన్న మళ్లీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈసారి ఆమె ఓర్చుకోకుండా తిరగబడింది. దాంతో ఆమెను కొట్టి ఆ తర్వాత బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన భర్తపై తప్పుడు కేసులు బనాయించి అతన్ని జైలుపాలు చేస్తామన్నారు. దీంతో భయపడ్డ బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వలేదు.
ప్రస్తుతం తన భర్త వీఆర్ఎస్ తీసుకుని అలీగఢ్‌లో వ్యాపారం చేస్తున్నాడు. తన భర్తకు జరిగిందంతా చెప్పగా ఆయన అండగా నిలుస్తానని ధైర్యం చెప్పడం వల్ల ఆమె భర్త సహాయంతో ఐజీఆర్ఎస్ పోర్టల్‌లో కంప్లైంట్ నమోదు చేసింది. అధికారులకు లేఖలు సైతం రాశారు. లేఖల ఆధారంగా అలీగఢ్ పోలీసులు బన్నాదేవి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు.