తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యానికి బానిసైన కోతి.. వైన్​ షాపులపై దాడి చేసి మరీ బాటిళ్ల చోరీ - యూపీ రాయ్‌బరేలీలో కోతితో ప్రజల ఇబ్బందులు

సాధారణంగా మనుషులు మద్యానికి బానిసలవుతారు. ఇక్కడ మాత్రం ఓ కోతి బానిస అయింది. మద్యం షాపులపై దాడి చేసి మరీ బాటిళ్లను ఎత్తుకెళ్తోంది. మద్యం కొనడానికి వచ్చిన వారి నుంచి సీసాలు లాక్కుని పారిపోతోంది.

monkey
కోతి

By

Published : Nov 1, 2022, 4:26 PM IST

ఉత్తర్​ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో మద్యానికి బానిసైన ఓ కోతి మద్యం వ్యాపారులకు చుక్కలు చూపిస్తోంది. షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలను ఎత్తుకెళ్తోంది. షాపుల నుంచి మద్యాన్ని కొనుక్కొని వెళ్తున్న వారి నుంచి మద్యం బాటిళ్లను లాక్కుంటోంది. అడ్డుకోబోయిన వారిపై దాడి చేస్తోంది. కోతి బీరు తాగుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

"కోతి నిత్యం షాపులపై దాడి చేసి బాటిళ్లను ఎత్తుకెళుతోంది. మమ్మల్ని, కస్టమర్​లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అడ్డుకోబోతే కోపంతో దాడి చేస్తోంది." అని అక్కడి ఓ షాపు యజమాని వాపోయాడు.
"మద్యానికి బానిసైన కోతి ఇక్కడి షాపు యజమానులకు, మద్యం కస్టమర్​లకు ఇబ్బందిగా మారింది. అటవీ శాఖ సహకారంతో ఈ కోతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం." అని జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.

మరోవైపు లఖ్​నవూ-కాన్పూర్ రహదారి దగ్గర నవాబ్‌గంజ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడా ఓ కోతి మద్యానికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంది. మొదటగా కోతికి బీరు కొని తాగించాడు ఓ కస్టమర్. తరువాత తరచుగా బీరు కొనిచ్చేవాడు. రోజూ చల్లని బీరుకు అలవాటుపడ్డ కోతి కాలేయ సమస్యలతో బాధ పడుతూ మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details