గుజరాత్ వడోదరలోని హైఫ్లై అనే విమాన రెస్టారెంట్(Aircraft-themed restaurant).. వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. వడోదర జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్(Flight restaurant) గగనవిహారం చేస్తూ విందు ఆరగించాలనుకునే వారి కలను.. నేలపైనే నెరవేర్చుతోంది. విమానం రెస్టారెంట్ ఒకేసారి 106 మంది అతిథులకు ఆహారం అందించే సామర్ధ్యంతో రూపొందింది.
అసలైన విమానంలో మాదిరిగానే వెయిటర్‌ను పిలిచేందుకు కావాల్సిన సెన్సార్లను ఈ రెస్టారెంట్‌లో (Flight restaurant vadodara) పొందుపరిచారు.
హైఫ్లై విమానం రెస్టారెంట్‌ను లోపల చాలా అందంగా తీర్చిదిద్దారు. అసలైన విమానంలో మాదిరి ఉండే అనుభూతి వినియోగదారులకు కలిగేలా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది సైతం ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ మాదిరిగానే దుస్తులు ధరించి వినియోగదారులకు ఆహారం అందిస్తున్నారు. దేశీయ రుచులతో పాటు విదేశీ ఆహారం సైతం అందిస్తున్నారు.
హైఫ్లై రెస్టారెంట్ విమానంలా(Flight restaurant vadodara) కనిపించడం కాదు. నిజమైన విమానాన్నే ఇలా రెస్టారెంట్‌గా మార్చారు దీని యజమాని. ఎప్పటి నుంచో విమానం తరహా రెస్టారెంట్ (Aircraft-themed restaurant) నిర్మించాలని భావించిన యజమాని ముఖి బెంగళూరుకు చెందిన ఒక సంస్థ వద్ద కాలం చెల్లిన విమానం కొని దాన్ని హోటల్‌గా మార్పులు చేశారు. ఇందుకోసం కోటిన్నర వరకు ఖర్చుచేసినట్లు సమాచారం.
''ఒకసారి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ నేగ్ యావియేషన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ వద్ద ఎయిర్‌బస్ 320 స్క్రాప్ ఉందని తెలిసింది. వారి వద్ద నేను కొన్నాను. స్క్రాప్ కాబట్టి చాలా వరకు మరమ్మతు చేయాల్సి వచ్చింది. రెక్కలు, తోక, ల్యాండింగ్ గేర్ వంటి భాగాలన్నీ విడదీసి గుజరాత్ తేవాల్సి వచ్చినప్పుడే లాక్‌డౌన్ విధించారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద ట్రాలీ వాహనాల ద్వారా విమాన భాగాలను ఇక్కడకు తెచ్చాం.''
- ముఖి, రెస్టారెంట్ యజమాని
హోటల్‌గా రూపుమార్చుకున్న విమానాల్లో వడోదర హైఫ్లై రెస్టారెంట్(Flight restaurant vadodara) ప్రపంచంలోనే తొమ్మిదోదని నిర్వాహకులు చెబుతున్నారు. భారత్‌లో నాలుగోదని, వడోదరలో మొదటిది అని చెప్పారు.
హైప్లై విమానం రెస్టారెంట్(Flight restaurant) వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. విమానం ముందు నిలబడి అందరూ సెల్ఫీ దిగుతున్నారు.