తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్‌ విమానాల అప్‌గ్రెడేషన్‌కు వాయుసేన నిర్ణయం - రఫేల్​ యుద్ధవిమానాలు

రఫేల్ యుద్ధ విమానాలను వచ్చే ఏడాది (rafale fighter plane) జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు వాయుసేన సిద్ధమైంది. ఇప్పటికే అప్‌గ్రేడ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.

rafale fighter jet
రఫేల్ ఒప్పందం

By

Published : Nov 22, 2021, 6:07 AM IST

ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను (rafale fighter plane) వచ్చే ఏడాది జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకోగా.. మరో మూడు డిసెంబర్‌లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు వాయుసేన సిద్ధమైంది. ఇప్పటికే అప్‌గ్రేడ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. భారత వాయుసేన ఆమోదం అనంతరం వచ్చే ఏడాది జనవరి నుంచి అప్‌గ్రేడ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

2016లో రఫేల్ యుద్ధ విమానాల (rafale deal) కొనుగోలుకు ఫ్రాన్స్‌తో రూ.60వేల కోట్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అప్‌గ్రేడ్‌కు అవసరమైన పరికరాలను ఫ్రాన్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. రఫేల్ యుద్ధ విమానాల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ హరియాణాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరగనుంది. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాలను నడపడంలో ఫైలెట్‌లకు శిక్షణ ప్రారంభమైంది.

ఇదీ చదవండి:modi yogi photo: 'నవ భారత నిర్మాణం కోసం కలిసి నడుస్తూ...'

ABOUT THE AUTHOR

...view details