భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్(Iaf air chief marshal) వివేక్ ఆర్ చౌదరి, భారత నావికా దళ(నేవీ) చీఫ్ డెసిగ్నేట్(Navy chief desgnate) వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరిని 'పరమ్ విశిష్ట్ సేవా'(Param vishisht seva medal) పురస్కారంతో సత్కరించింది కేంద్రం. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును వారు అందుకున్నారు.
రాష్ట్రపతి నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఐఏఎఫ్ చీఫ్ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తున్న ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ ఈ ఏడాది సెప్టెంబరు 30న ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ ఆర్ చౌదరి బాధ్యతలు చేపట్టగా.. నవంబరు 30 నుంచి వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరోవైపు.. గల్వాన్ లోయలో(Galwan valley news) చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అసువులు బాసిన కర్నల్ సంతోష్ బాబుకు కేంద్రం 'మహావీర్ చక్ర' పురస్కారంతో సత్కరించింది. సంతోష్ బాబు తరఫున ఆయన భార్య, తల్లి ఈ కార్యక్రమానికి హాజరై.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
అవార్డును స్వీకరిస్తున్న కర్నల్ సంతోష్ బాబు భార్య, తల్లి రాష్ట్రపతికి నమస్కారం చేస్తున్న కర్నల్ సంతోష్ బాబు, భార్య ఇదే కార్యక్రమంలో.. గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించినందుకు గాను పలువురు సైనికులకు(Awards for galwan heroes) వారి మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కరాలతో కేంద్రం సత్కరించింది.
సైనికుడు గురుతేజ్ సింగ్‌కు మరణానంతరం.. వీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది కేంద్రం. గురుతేజ్ తరఫున అతని తల్లిదండ్రులు.. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
వీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న గురుతేేజ్ సింగ్ తల్లిదండ్రులు సైనికుడు నాయక్ దీపక్ సింగ్‌కు కూడా మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారంతో కేంద్రం సత్కరించింది. దీపక్ సింగ్ తరఫున ఆయన భార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.
వీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న నాయక్ దీపక్ సింగ్ భార్య హవిల్దార్ కె పళనికి కూడా మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారాన్ని అందించింది కేంద్రం. పళని భార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
వీర్ చక్ర పురస్కారాన్ని అందుకుంటున్న హవిల్దార్ కె పళని భార్య నాయిబ్ సుబేదార్ నుదురమ్ సొరేన్‌ను మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారంతో సత్కరించగా... ఈ అవార్డును అతని భార్య రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.
వీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న నాయిబ్ సుబేదార్ నుదురామ్ భార్య 4 పారా స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన సుబేదార్ సంజీవ్ కుమార్‌కు మరణానంతరం 'కీర్తి చక్ర' పురస్కారాన్ని అందించింది కేంద్రం. అతని భార్య రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కీర్తి చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న సుబేదార్ సంజీవ్ కుమార్ భార్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో వెన్ను చూపకుండా ప్రత్యర్థులను ఎదుర్కొని గాయపడ్డ హవిల్దార్ తేజేందర్ సింగ్‌కు 'వీర్ చక్ర' పురస్కారాన్ని కేంద్రం ప్రదానం చేసింది.
రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరిస్తున్న హవిల్దార్ తేజేందర్ సింగ్ ఇదీ చూడండి:పాక్ విమానాన్ని కూల్చేసిన అభినందన్‌కు 'వీర్ చక్ర'