తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టాలిన్​పై ట్రాన్స్​జెండర్ అప్సర పోటీ! - పన్నీర్ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్​కు ప్రత్యర్థిగా కొలతూర్​ నియోజక వర్గంలో ట్రాన్స్​జెండర్​ అప్సరా రెడ్డిని బరిలోకి దింపేందుకు అన్నాడీఎంకే సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం స్టాలిన్​ కొలతూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

AIADMK likely to field Transgender activist Apsara against MK Stalin
స్టాలిన్​కు పోటీగా ట్రాన్స్​జెండర్ కార్యకర్తను దింపనున్న అన్నాడీఎంకే !

By

Published : Mar 2, 2021, 11:30 AM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్​ సొంత నియోజకవర్గం కొలతూర్​లో ట్రాన్స్​ జెండర్ కార్యకర్త అప్సరా రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తోంది అన్నాడీఎంకే. కొలతూర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్సర సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్​డౌన్​ ప్రారంభమైన వేళ.. ప్రధాన పార్టీలన్నీ సీట్ల పంపకాలను ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలన్నీ వచ్చేవారం తమ అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

  • స్థానాలు:- 234
  • పోలింగ్​ తేదీ:- ఏప్రిల్​ 6
  • ఫలితాలు:- మే 2

ABOUT THE AUTHOR

...view details