తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేబినెట్​ నుంచి కీలక నేతలు ఔట్- ఎందుకిలా? - union ministers resign

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులైన రమేశ్ పోఖ్రియాల్, సదానంద గౌడ, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్​.. రాజీనామా సమర్పించారు. మొత్తం 12 మంది మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.

union ministers resigns
కేబినెట్​ నుంచి కీలక నేతలు ఔట్- ఎందుకిలా?

By

Published : Jul 7, 2021, 5:12 PM IST

Updated : Jul 7, 2021, 6:00 PM IST

కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు వరుసగా తమ రాజీనామాలను సమర్పించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్​ సైతం మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.

మొత్తం 12 మంది మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆరోగ్య కారణాలతో పోఖ్రియాల్ రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్ బారిన పడ్డ ఆయన ఏప్రిల్​ నెలలో దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. ఆ తర్వాత కొవిడ్ అనంతర సమస్యలతో జూన్​లో మరోసారి ఆస్పత్రిపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.

రాజీనామా చేసింది వీరే...

రాజీనామా చేసిన 12 మంది మంత్రుల వివరాలు ఇలా..

  1. డాక్టర్ హర్షవర్ధన్- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
  2. ప్రకాశ్ జావడేకర్- కేంద్ర పర్యావరణం, అటవీ- పర్యావరణ మార్పులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి
  3. రవిశంకర్ ప్రసాద్- కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్- ఐటీ- కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి
  4. రమేశ్ పోఖ్రియాల్- కేంద్ర విద్యా శాఖ మంత్రి
  5. సదానంద గౌడ- కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి
  6. బాబుల్ సుప్రియో- కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి
  7. సంతోష్ గంగవార్- కేంద్ర కార్మిక శాఖ మంత్రి
  8. సంజయ్ ధోత్రే- కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి
  9. దేబశ్రీ చౌదరి- కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
  10. థావర్‌చంద్‌ గెహ్లోత్‌- సామాజిక న్యాయం, సాధికరత శాఖ మంత్రి
  11. ప్రతాప్ సారంగి- పశు సంవర్ధక, పాడి, మత్స్య, ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి
  12. రతన్‌లాల్ కటారియా- జల్ శక్తి, సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి

'అడిగారు.. చేశాను'

రాజీనామా చేయాలని కోరినందున, అందుకు అనుగుణంగా తాను నడుచుకున్నానని బాబుల్ సుప్రియో పేర్కొన్నారు. దేశానికి సేవచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఫేస్​బుక్ పోస్ట్​లో తెలిపారు.

రాజీనామా విషయాన్ని గంగవార్ ధ్రువీకరించారు. కేంద్రంలో తర్వాత తనకు అప్పగించే బాధ్యతలపై స్పష్టతలేదని చెప్పారు.

ఇదీ చదవండి:మోదీ కేబినెట్​లో భారీ మార్పులు- కొత్తగా 43 మంది...

Last Updated : Jul 7, 2021, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details