నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని కోరారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture Minister) నరేంద్ర సింగ్ తోమర్. వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repeal) చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) ప్రకటించిన క్రమంలో తిరిగి ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఆందోళనలు కొనసాగించేందుకు ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు.
" పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే సాగు చట్టాల రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నాం. పంట మార్పిడి, జీరో బడ్జెట్ సాగు, అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టంగా కనీస మద్దతు ధర వ్యవస్థను మార్చేందుకు ప్రధాని మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారు. దీని ద్వారా కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేరుతుంది. పంట వ్యర్థాలను కాల్చటాన్ని నేరంగా పరిగణించకూడదని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను భారత ప్రభుత్వం ఆమోదించింది. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించాక.. ఆందోళనలు కొనసాగించేందుకు ఎలాంటి కారణం లేదు. రైతులు తమ ఆందోళనలు ముగించి ఇళ్లకు వెళ్లిపోవాలి. "
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.