తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమే..' - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

కొత్త సాగు చట్టాలపై రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ తెలిపారు. అయితే.. చట్టాలపై ఉన్న అభ్యంతరాలను తెలపాలన్నారు.

Agri Minister
వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​

By

Published : Jun 10, 2021, 5:04 AM IST

సాగుచట్టాలపై రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. చట్టాలపై ఉన్న అభ్యంతరాలను తెలపాలన్నారు.

" దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యవసాయంలో సంస్కరణలు తీసుకురావాలని అనుకున్నాయి. కానీ వారికి ధైర్యం సరిపోలేదు. కానీ మోదీ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ సంస్కరణల వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లోని రైతులు లబ్ధి పొందారు. ఈ లోపు రైతు ఉద్యమం మొదలైంది."

-- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

సాగుచట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 11 సార్లు చర్చలు జరిగాయి. జనవరి 22 న చివరిసారి చర్చలు జరిగాయి. జనవరి 26న ఎర్రకోట ఘటన తర్వాత.. చర్చలు ప్రారంభంకాలేదు.

ఇదీ చదవండి :Rahul: 'స్థానిక భాషలను కాపాడుకుందాం'

ABOUT THE AUTHOR

...view details