తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికాలో భారతీయుడి క్రెడిట్​ కార్డు బ్లాక్​.. పస్తులతో 6 కిలోమీటర్లు నడుస్తున్న డాక్టర్​

క్రెడిట్ కార్డు పనిచేయక ఓ భారతీయ యువ​ డాక్టర్​ అమెరికాలో నానా ఇబ్బందులు పడుతున్నాడు. గత 5 రోజులుగా తిండీతిప్పలు లేకుండా అల్లాడిపోతున్నాడు. చదువుకోసం అని రోజుకు దాదాపుగా 6 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సంబంధిత బ్యాంకు అధికారులు అసలు ఆ సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన తండ్రి తన కుమారుడు పరిస్థితిని వెల్లడిస్తూ ఆవేదన చేశాడు.

Doctor upset in America
డాక్టర్​ అక్షిత్​ శర్మ

By

Published : Jan 14, 2023, 10:39 PM IST

ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన ఓ యువ డాక్టర్​ అమెరికాలో నానా ఇబ్బందులు పడుతున్నాడు. అతడి బ్యాంక్ అకౌంట్లో వేల రుపాయలు ఉన్నా సరే.. క్రెడిట్​ కార్డు పనిచేయకపోవడం వల్ల ఆకలి, దాహంతో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన తండ్రి షాహ్​గంజ్​ జిల్లాకు చెందిన​ డాక్టర్​​ సునీల్ శర్మ తెలిపారు. సంబంధిత బ్యాంకుకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

"నా కుమారుడు అక్షత్​ శర్మ దిల్లీలో ఎంబీబీఎస్​ పూర్తి చేశాడు. అనంతరం రెండు నెలల ట్రైనింగ్​ కోసం గత సంవత్సరం డిసెంబర్​లో అమెరికాకు వెళ్లాడు. అక్షత్​కు షాహ్​గంజ్​లోని ఓ ప్రైవేట్​ బ్యాంక్​లో ఇంటర్నేషనల్​ క్రెడిట్​ కార్డు ఉంది. అక్షత్​ జనవరి 8వ తేదీన అమెరికాలోని రిచ్​మండ్​ నుంచి టంపాకు విమానంలో వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడ క్రెడిట్ కార్డు పనిచేయక చాలా ఇబ్బంది పడ్డాడు. అక్కడ వారు నగదును స్వీకరించలేదు. అక్షత్​ బాధను అర్ధం చేసుకున్న ఓ భారతీయ కుటుంబ అతడికి సాయం చేసింది. క్రెడిట్​ కార్డు పనిచేయక అక్షత్ 5 రోజుల నుంచి ఆకలి, దాహంతో ఉంటున్నాడు. అంతేకాదు చదువు కోసం అని రోజుకు 6 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిర్యాదు చేసినా సరే బ్యాంకు అధికారులు వినేందుకు సిద్ధంగా లేరు. దీనిపై బ్యాంక్ మేనేజర్​కు కాల్​ చేయగా అతను నా కాల్​ను కట్​ చేస్తున్నారు. దీంతో దేశం కాని దేశంలో నా కుమారుడు కష్టాల్లో ఉన్నాడు".
--డాక్టర్​​ సునీల్ శర్మ, నవదీప్ హాస్పిటల్ డైరెక్టర్, ఆగ్రా సర్జన్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​

ABOUT THE AUTHOR

...view details