Agni Prime Missile: 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం ఉదయం చేపట్టిన ఈ వ్యూహాత్మక క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి చేరుకుందని డీఆర్డీఓ ప్రకటించింది.
'అగ్ని-పి' అనేది అగ్ని సిరీస్ క్షిపణుల్లో అధునికీకరించిన వెర్షన్. 1,000, 2,000 కి.మీల మధ్య శ్రేణి సామర్థ్యంతో దీనిని రూపొందించారు.