తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చర్చలకు సిద్ధం.. తేదీ చెప్పండి: రైతు నేతలు - farmer unions about next round of talks

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. తాము చర్చలకు సిద్ధమేనని తెలిపాయి. అయితే.. ప్రభుత్వమే ఓ తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నాయి. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వలేకపోతోందని ప్రశ్నించాయి.

farmers protest
తేదీ చెప్పండి.. చర్చలకు మేం సిద్ధం: రైతు నేతలు

By

Published : Feb 8, 2021, 6:26 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు.. తాము మరోమారు చర్చలకు సిద్ధమేనని సోమవారం తెలిపాయి. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభుత్వమే ఒక తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నాయి. ఆందోళన విరమించి, చర్చలకు రావాలని రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన అనంతరం.. రైతు సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

దేశంలో 'ఆందోళన జీవులు' అనే కొత్త రకం జీవులు ఏర్పడ్డాయని రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను రైతు సంఘాలు ఖండించాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు ప్రముఖ పాత్ర పోషించాయని పేర్కొన్నాయి.

"ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పుడు మేమెప్పుడూ తిరస్కరించలేదు. కేంద్ర మంత్రులతో మేం భేటీ అయ్యాం. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మేం సిద్ధమే. ప్రజాస్వామ్యంలో నిరసనలకు పెద్ద పాత్ర ఉంది. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలను వ్యతరేకించే హక్కు.. ప్రజలకు ఉంది."

--శివ కుమార్​ కక్కా, సంయుక్త కిసాన్​ మోర్చా సీనియర్ సభ్యుడు

రాజ్యసభలో సోమవారం ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 'కనీస మద్దతు ధర ఇప్పుడూ ఉంది, ఇక మీదటా ఉంటుంది' అని స్పష్టం చేశారు. దీనిపై రైతు నాయకులు భిన్నంగా స్పందించారు.

మరి ఆ పని ఎందుకు చేయట్లేదు?

'ప్రభుత్వం వంద సార్లు కనీస మద్దతు ధర ఉంటుందని చెప్పింది. మరి అలాంటప్పుడు దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోతోంది' అని సంయుక్త కిసాన్​ మోర్చా నేత అభిమన్యు కోహర్​ ప్రశ్నించారు. తాము చర్చలకు సిద్ధమేనని ఆయన అన్నారు. కానీ, ప్రభుత్వమే అధికారిక ఆహ్వానాన్ని అందించాలి" అన్నారు.

ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోతోందో తెలుసుకోవాలని ఉందని పంజాబ్ భారతీయ కిసాన్ యూనియన్​(బీకేయూ) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్​ సింగ్​ అన్నారు. అసలు విషయాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు.

ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఇప్పటివరకు 11 సార్లు చర్చలు జరిగాయి.

ఇదీ చదవండి:'సిక్కులు దేశానికి గర్వ కారణం.. వారిని దూషించొద్దు'

ఇదీ చదవండి:'ఎంఎస్​పీ ముగుస్తుందని మేం చెప్పలేదే'

ABOUT THE AUTHOR

...view details