భారత్‌లో కరోనా రెండోదశ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నప్పటికీ.. వైరస్ ముప్పు మాత్రం తొలగిపోలేదు. సెకండ్‌వేవ్‌లో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఇది ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైతే దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా మాత్రమే వర్గీకరించింది కేంద్రం. దాని తీవ్రతను బట్టి ఆందోళనకర వేరియంట్‌గా వర్గీకరించాలో లేదో నిర్ణయించనుంది.
మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గు్ర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వేరియంట్‌తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.