ఒడిశా- అంగుల్ జిల్లాలోని సాట్కోసియా వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఓ మొసలి చరిత్ర సృష్టించింది. అక్కడి అభయారణ్యంలోని ఘేరియల్(చేపలను ఆహారంగా తీసుకునేది) జాతికి చెందిన ఓ మెుసలి సుమారు 30ఏళ్ల తర్వాత.. ఏకంగా 28 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ఫారెస్ట్ చీఫ్ రేంజర్ ప్రదీప్రాజ్ కరాటే వెల్లడించారు.
30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి
ఒడిశాలో ఓ మెుసలి అరుదైన ఘనత సాధించింది. సుమారు 30 ఏళ్ల తర్వాత.. మరోసారి 28 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మొసలి పిల్లలన్నింటినీ సహజ వాతావరణంలోనే పెంచుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
మొసలి, ఘేరియల్
మహానది సాట్కోసియాలో నివాసముండే ఘేరియన్ 30 ఏళ్ల తర్వాత.. మరోసారి ఇలా 28 పిల్లలకు జన్మనిచ్చిందని ప్రదీప్రాజ్ చెప్పారు. ఫలితంగా.. మూడు దశాబ్దాల అనంతరం.. ఘేరియల్ తన గుర్తింపును తిరిగి పొందిందన్నారు. సంబంధిత దృశ్యాలను అటవీ శాఖ విడుదల చేసింది. సాట్కోసియాలోని సహజ వాతావరణంలో వీటిని పోషిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్!
Last Updated : May 24, 2021, 12:04 PM IST