పార్శిల్ సేవలను వినియేగదారులకు అనువైన రీతిలో ఆధనికీకరించడం వల్ల ఈ ఏడాది దీని ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని రైల్వేశాఖ తెలిపింది. కంప్యూటరీకరించిన రైల్వే పార్శిల్ మేనేజ్మెంట్ సిస్టం తొలి దశలో 84 స్టేషన్లకు పరిమితం కాగా, రెండో దశలో 143 స్టేషన్లకు విస్తరించిందని, మూడో దశలో 523 స్టేషన్లకు విస్తరింపజేయనున్నామని రైల్వే శాఖ తెలిపింది.
రైల్వే పార్శిల్ మేనేజ్మెంట్ సిస్టం కంప్యూటరీకరణ - కంప్యూటరీకరించిన రైల్వే పార్శిల్ మేనేజ్మెంట్ సిస్టం
రైల్వే పార్శిల్ సేవలను మరింత మెరుగుపరుస్తూ ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. 120రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు కంప్యూటరీకరించిన రైల్వే పార్శిల్ మేనేజ్మెంట్ సిస్టంను ప్రవేశపెట్టింది.
రైల్వే పార్శిల్ మేనేజ్మెంట్ సిస్టం కంప్యూటరీకరణ
ప్రస్తుతం వినియోదారులు 120 రోజుల ముందుగానే పార్శిల్ స్పేస్ బుక్ చేసుకోవచ్చని, దానివల్ల వారు ముందస్తు ప్రణాళికకు అనుగుణంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ సరకును రవాణా చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పుడు ప్రతి కన్సయిన్‌మెంట్‌కు బార్‌కోడింగ్ కేటాయిస్తున్నారు.
ఇదీ చదవండి:రైల్వే ఒప్పంద కార్మికులకు 'శ్రామిక్ పోర్టల్' అండ!