తెలంగాణ

telangana

ETV Bharat / bharat

127రోజులు, 15లక్షల కి.మీలు- 'ఆదిత్య L1' జర్నీ సాగిందిలా! - ఆదిత్య ఎల్​1 అప్డేట్

Aditya L1 Mission Full Details : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. 127 రోజులపాటు సాగిన ఆదిత్య ఎల్-1 ప్రయోగ ప్రయాణం గురించి తెలుసుకుందాం.​

Aditya L1 Mission Full Details
Aditya L1 Mission Full Details

By PTI

Published : Jan 6, 2024, 9:31 PM IST

Aditya L1 Mission Full Details :అంతరిక్ష రంగంలో భారత్‌ మరో మైలురాయిని అందుకుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశించింది. సూర్యుడిని పరిశోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. రాకెట్‌ ప్రయోగం నుంచి 'ఎల్‌1' కక్ష్యలో చేరేవరకూ 127 రోజులపాటు సాగిన 'ఆదిత్య ఎల్‌1' ప్రయాణాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

  • 2023 సెప్టెంబరు 2 : ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 'పీఎస్‌ఎల్‌వీ సీ-57' రాకెట్‌లో నింగికెగసిన ఆదిత్య ఎల్‌1. భూమి చుట్టూ 235 కి.మీ x 19500 కి.మీల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశం.
  • సెప్టెంబరు 3: మొదటి భూకక్ష్య పెంపు విన్యాసం. 245 x 22,459 కి.మీల కక్ష్యలో ప్రవేశించిన ఉపగ్రహం.
  • సెప్టెంబరు 5: రెండోసారి కక్ష్య పెంపుతో 282 x 40,225 కి.మీల భూకక్ష్యలోకి చేరిక.
  • సెప్టెంబరు 10: మూడో భూకక్ష్య పెంపు. 'ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ASPEX)' పేలోడ్‌లోని సూపర్‌థర్మల్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌ (STEPS)ను యాక్టివేట్‌ చేసింది ఇస్రో.
  • సెప్టెంబరు 18: నాలుగోసారి భూకక్ష్యను పెంచారు. 'స్టెప్స్‌' పరికరం శాస్త్రీయ సమాచార సేకరణ ప్రారంభించింది.
  • సెప్టెంబరు 19: ఐదోసారి కక్ష్యను పెంచి, సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రాంజియన్‌ పాయింట్‌-1 ఇన్సర్షన్‌ విన్యాసం చేపట్టారు. దీంతో 'ఎల్‌1' వైపు ప్రయాణం మొదలైంది.
  • సెప్టెంబరు 25: 'ఎల్‌1' పాయింట్ చుట్టూ అంతరిక్ష పరిస్థితులను అంచనా వేశారు.
  • సెప్టెంబరు 30: భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటిన ఉపగ్రహం.
  • అక్టోబరు 6: వ్యోమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని చేపట్టింది ఇస్రో.
  • నవంబర్ 7: తొలిసారి సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించిన వ్యోమనౌక. 'హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌' (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది.
  • డిసెంబర్ 1: ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ASPEX) పేలోడ్‌లోని రెండో పరికరం 'సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్' (SWIS) పనిచేయడం ప్రారంభం. ఇది సౌర గాలులను అధ్యయనం చేస్తోంది.
  • డిసెంబర్ 8: సోలార్‌ అల్ట్రావయొలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌ (SUIT) పేలోడ్‌ అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం చేరువ నుంచి సూర్యుడి చిత్రాలను బంధించింది.
  • 2024 జనవరి 6: లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన ఆదిత్య ఎల్‌1. ఇక్కడే ఉంటూ సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details