తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ఆల్ ఇండియా సమాత్తువ మక్కల్ కాట్చి పార్టీ అధినేత శరత్‌కుమార్ బుధవారం వెల్లడించారు. తమిళనాడు తూత్తుకుడిలోని ట్రావియపురంలో నిర్వహించిన పార్టీ 6వ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కోవిల్పట్టి నియోజకవర్గం నుంచి రాధిక పోటీ చేయనున్నారని తెలిపారు.
ప్రసంగిస్తున్న శరత్‌కుమార్ మరోసారి అధినేతగా..
ఈ కార్యక్రమంలో భాగంగా సమాత్తువ మక్కల్ కాట్చి కీలక పదవులకు ఎన్నికలు నిర్వహించారు. అధినేతగా శరత్‌కుమార్ మరోసారి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఎన్ సుందరసన్ కోశాధికారిగా ఎన్నికవగా.. పార్టీలో కొత్తగా ఏర్పాటైన ప్రిన్సిపల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి రాధిక ఎన్నికయ్యారు. తమ కూటమికి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని శరత్‌కుమార్ ప్రకటించారు.
ఇదీ చదవండి :కలాం సలహాదారుడికి కమల్ పార్టీలో కీలక పదవి