కాంగ్రెస్కు రాజీనామా చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. తన రాజకీయ భవిష్యత్తుపై మీడియాతో మాట్లాడారు. ఎన్నికలపై పూర్తి నమ్మకంతో ఉన్నానని చెప్పారు.
'కాంగ్రెస్ హామీలన్నీ నా హయాంలోనే పూర్తి చేశాం'
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తన హయాంలోనే నెరవేరాయని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. పలువురు నేతలు తనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. 92 శాతం హామీలు తన హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు. చాలా మంది నేతలు తనపై చిల్లర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కెప్టెన్.
అమరీందర్ సింగ్ రాజీనామా (Amarinder Singh News) పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో గందరగోళానికి దారి తీసింది. గత 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన అమరీందర్ సింగ్.. ఆ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా అమరీందర్ సింగ్ రాజీనామా చేశారన్న పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్ రావత్ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించారు.
TAGGED:
AMARINDER SINGH