తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉప రాష్ట్రపతి ఎన్నికకు.. నేటి నుంచే నామినేషన్లు! - Vice President election nominations start

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి మొదలు కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరించనున్నారు.

ELECTION
ELECTION

By

Published : Jul 5, 2022, 5:40 AM IST

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం మొదలుకానుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. వాటిని 20న పరిశీలిస్తారు. ఉపసంహరణకు తుది గడువు జులై 22. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న నిర్వహిస్తారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. నామినేటెడ్‌ సభ్యులకూ అర్హత ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details