AAI Jobs Recruitment 2023 :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభవార్త. న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఏఏఐ కార్యాలయాల్లోని 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
AAI Job Vacancy :496 -జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులు
ఏజ్ లిమిట్..
AAI Junior Executive Jobs Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 30 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
విద్యార్హతలు..
AAI Jobs For Engineers :అభ్యర్థులు బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము(AAI Junior Executive Jobs Application Fee)..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.1000/- నిర్ణయించారు.
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసిన అభ్యర్థులకు కూడా ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు.
ఎంపిక విధానం(AAI Junior Executive Selection Process)..
- రాత పరీక్ష(ఆన్లైన్ టెస్ట్)
- వాయిస్ టెస్ట్
- సైకోయాక్టివ్ సబ్స్టాన్స్ టెస్ట్
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతభత్యాలు..
AAI Jobs Salary : ఉద్యోగంలో చేరాక రూ.40,000 నుంచి రూ.1,40,000 చొప్పున ప్రతి నెలా వేతనం చెల్లిస్తారు.