తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో దారుణం.. 7నెలలుగా చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అత్యాచారం​ - కర్ణాటక లేటెస్ట్​ న్యూస్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై అత్యాచారం చేశాడు ఓ కామంధుడు. మహిళల వార్డులోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక కలబురగి జిల్లాలో జరిగింది.

Woman patient was raped at Hospital
Woman patient was raped at Hospital

By

Published : Mar 18, 2023, 6:13 PM IST

కర్ణాటక కలబురగి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై అత్యాచారం చేశాడు ఓ కామంధుడు. మహిళల వార్డులోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గుల్బర్గా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​లో (GIMS) జరిగింది.

ఇదీ జరిగింది..
కలబురగికి చెందిన మహాబూబ్​ పాషా అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పట్టణంలోని గుల్బర్గా ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో తిరిగిన అతడు.. మహిళల వార్డులోకి అక్రమంగా ప్రవేశించాడు. అనంతరం అక్కడ చికిత్స పొందుతున్న 36 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన పక్క వార్డు రోగి.. ఆ ఘటనను ఫోన్​లో చిత్రీకరించాడు. అనంతరం నిందితుడిని పట్టుకుని అందరిని పిలిచాడు. అక్కడికి చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది.. జరిగిన విషయాన్ని తెలుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

"ఆస్పత్రిలోని నర్స్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మాకు అందిన సమాచారం ప్రకారం.. మహిళ గత ఏడు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని బ్రహ్మపుత్ర పోలీస్ స్టేషన్​కు తరలించాం. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందడం లేదు. కానీ అతడు ఆస్పత్రికి ఎందుకు వచ్చాడనే కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టాం."
-పోలీసులు

అసోంలో కిడ్నాప్​.. బిహార్​లో ప్రత్యక్ష్యం.. రైడ్​ తీసుకెళ్తానని చెప్పి
అసోంలో కిడ్నాప్​నకు గురైన ఇద్దరు సోదరులను బిహార్​లో ప్రత్యక్షమయ్యారు. వీరిని త్వరలోనే అసోంకు తీసుకువస్తామని గువాహటి పోలీస్ కమిషనర్​ దిగంత బారా తెలిపారు. బాలురు ప్రస్తుతం వైశాలి జిల్లాలని మహూవా పోలీస్ స్టేషన్​లో ఉన్నారని.. వారిని అసోంకు తీసుకువచ్చేందుకు తమ పోలీసు బృందం అక్కడికి బయలుదేరిందని చెప్పారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం వరకు గువాహటికి చేరుకుంటారని తెలిపారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది
తెతెలియాకు చెందిన ఇద్దరు సోదరులను గురువారం సాయంత్రం కిడ్నాప్​నకు గురయ్యారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పిన నిందితుడు ఇద్దరు సోదరులను ఎత్తుకెళ్లాడు. వీరిలో ఒకరి వయసు 9 ఏళ్లు కాగా, మరొకరి వయసు నాలుగేళ్లు. బాలుర తండ్రి వద్ద నిందితుడు డ్రైవర్​గా పనిచేసేవాడు. కొన్ని కారణాల వల్ల ఇటీవలె ఉద్యోగం మానేశాడు. గురువారం కొత్త వాహానాన్ని కొనుగోలు చేసిన నిందితుడు.. బాలురలకు చాక్లెట్లు కొనిచ్చి రైడ్​కు తీసుకెళ్తానని చెప్పి ఎత్తుకెళ్లాడు.

ABOUT THE AUTHOR

...view details