తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు కుమార్తెలతో తల్లి రైలు కిందపడి.. - మహాసముంద్​ వార్త

ఛత్తస్​గఢ్​లో ఓ మహిళ, తన ఐదుగురు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవ పడిన కారణంగానే మహిళ ఈ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

A woman and 5 girls died
ఛత్తీస్​గఢ్​లో తల్లి, ఐదుగురు పిల్లలు మృతి

By

Published : Jun 10, 2021, 11:56 AM IST

Updated : Jun 10, 2021, 1:08 PM IST

ఛత్తీస్​గఢ్​లోని మహాసముంద్​ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళ తన ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. మహాసముంద్​, బేల్​సొండా రైల్వే జంక్షన్​ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

ఇదీ జరిగింది...

ఉమా సాహు (45), జిల్లాలోని బెమ్చా గ్రామంలో తన భర్తతో నివసిస్తోంది. వారికి నలుగురు ఆడపిల్లలు. ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఉమా.. తన ఐదుగురు పిల్లలతో కలిసి.. మహాసముంద్​, బేల్​సొండా రైల్వే జంక్షన్ దగ్గిరికి బుధవారం రాత్రి వెళ్లింది. వేగంగా ప్రయాణిస్తున్న రైలు ముందు పట్టాలపై దూకారు. ఈ ఘటనలో అందరూ మరణించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రైలు పట్టాలపై పడిన మృతదేహాలు

ఇదీ జరిగింది:Rape: బాలికపై ఏడుగురు మైనర్లు అత్యాచారం

మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...

Last Updated : Jun 10, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details