ముంబయిలో 2008 నవంబరు 26 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ట్విట్టర్ వేదికగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తుతెలియని దుండగులు. ఆ ట్వీట్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ది ఎటాక్స్ ఆఫ్ 26/11' సినిమా పోస్టర్‌ను ఉపయోగించారు. అందులో 'మూవీ రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుంది?' అని అందులో రాసి ఉంది. ఈ ట్వీట్ శుక్రవారం రాత్రి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ట్వీట్‌లో గుజరాత్‌లోని ఓ వ్యక్తి పేరు, చిరునామా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ బెదిరింపులు బూటకమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. శుక్రవారం కూడా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎన్ఐఏకు మెయిల్ చేశాడు. తనకు తానే తాలిబన్‌ను అని చెప్పుకుంటూ.. ముంబయిలో దాడులకు పాల్పడతానని బెదిరించాడు. ఈ వరుస బెదిరింపులతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ విషయంలో ఎన్ఐఏ ముంబయి పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
'ముంబయిలో ఉగ్రదాడులు చేస్తాం'.. ట్విట్టర్ వేదికగా మరోసారి వార్నింగ్.. భయపడొద్దన్న పోలీసులు - ముంబయిలో ఉగ్రదాడులు ట్విట్టర్ వార్నింగ్ న్యూస్
ముంబయిలో ఉగ్రదాడులు జరుపుతామంటూ.. ట్విట్టర్ వేదికగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తుతెలియని దుండగులు. వరుస బెదిరింపులతో అప్రమత్తమయిన పోలీసులు.. ఇలాంటి బెదిరింపులు సహజమేనని.. నగరవాసులకు తాము ఉన్నామని భరోసానిచ్చారు.
ముంబయిలో ఉగ్రదాడులు చేస్తామంటూ మరోసారి బెదిరింపులు
నగరవాసులకు భరోసా ఇచ్చిన పోలీసులు
బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు ముంబయికి ఎలాంటి ప్రమాదం లేదంటూ.. నగరవాసులకు అండగా తాము ఉన్నాంటూ భరోసానిచ్చారు. ఇలాంటి బెదిరింపులు సహజమేనని.. ఈ విషయాలలో తాము ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటామని ముంబయి పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే ఈ విషయంలో ముంబయివాసులు కూడా అప్రమత్తంగా ఉంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
Last Updated : Feb 4, 2023, 6:19 PM IST