తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జ్యోతిష్యాన్ని నమ్మి కుమార్తెను హత్య చేసిన తల్లి.. ఆపై ఆత్మహత్య - తమిళనాడు వార్తలు

Mother killed her daughter: జ్యోతిష్యాన్ని నమ్మిన ఓ తల్లి సొంత కూతురిని హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్​ జిల్లాలో జరిగింది. ఇంత కఠిన నిర్ణయం తీసుకునేందుకు గల కారణం ఏమిటి? జ్యోతిష్యంలో ఇంతకి ఏం తెలుసుకున్నారు?

mother who killed her daughter
జ్యోతిష్యాన్ని నమ్మి కుమార్తెను హత్య చేసిన తల్లి

By

Published : Jan 7, 2022, 9:23 AM IST

Mother killed her daughter: జాతకాలు, జ్యోతిష్యాన్ని కొందరు విపరీతంగా నమ్ముతారు. అందులో చెప్పినవి జరిగి తీరుతాయని విశ్వసిస్తారు. అలాంటి వారు ఒక్కోసారి ఏదైనా చేసేందుకు సిద్ధపడుతుంటారు. ఈ కోవకే చెందిన ఓ తల్లి.. జ్యోతిష్యాన్ని నమ్మి సొంత కూతురినే చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు, కోయంబత్తూర్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

కోయంబత్తూర్​ జిల్లా, తుడియలూర్​కు సమీపంలోని అప్పనయక్కంపలయమ్​ గ్రామానికి చెందిన ధనలక్ష్మి(58) అనే మహిళకు దివ్యాంగురాలైన కుమార్తె సుగన్య(30), కుమారుడు శశికుమార్​ ఉన్నారు. శశికుమార్​ వివాహం చేసుకుని సరవనంపట్టిలో వేరుకాపురం పెట్టారు. ధనలక్ష్మి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు.

ధనలక్ష్మి

ఈ క్రమంలోనే జనవరి 4వ తేదీన తన కుమారుడు శశికుమార్​కు ఫోన్​ చేశారు ధనలక్ష్మి. 'జ్యోతిష్యంలో నా గురించి తెలుసుకున్నాను. అందులో కాలు లేదా చేయి లేకుండా మారతానని తెలిసింది. సోదరి సుగన్యతో పాటు నేనూ అలా మారితే నీకు సమస్యలు ఎదురవుతాయి. జ్యోతిష్యంలో చెప్పినట్లు జరిగితే మమ్మల్ని చూసుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం.' అని శశికుమార్​తో చెప్పారు ధనలక్ష్మి. తల్లి మాటలతో ఆందోళన చెందిన శశికుమార్​.. అలా జరగదని, మిమ్మల్ని బాగా చూసుకుంటానని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

సుగన్య

మరుసటి రోజు జనవరి 5న తల్లి దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్న శశికుమార్​ ఫోన్​ చేసి చూశాడు. అయితే.. ధనలక్ష్మి ఫోన్​ ఎత్తలేదు. దీంతో వెంటనే పొరుగింటి వారికి ఫోన్​ చేసి.. ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడమని కోరారు శశి. వారు వెళ్లి చూడగానే ధనలక్ష్మి ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వారు ఆయనకు అందించారు. దీంతో హుటాహుటిన ఇల్లు చేరిన అతనికి తల్లి ఉరివేసుకుని, సోదరి నోటిలో నురగలతో విగతజీవులుగా కనిపించారు.

దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు శశి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మి ముందుగా తన కూతురికి విషం ఇచ్చి ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు పోలీసులు.

ఇదీ చూడండి:

ఆస్తి కోసం మామను హత్య చేసిన అల్లుడు

కోడలిని గొంతు కోసి చంపిన మామ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ABOUT THE AUTHOR

...view details