అత్యాచారానికి యత్నించిన కామాంధుడ్ని చితకబాది, ఓ యువతిని రక్షించారు ఇద్దరు ట్రాన్స్జెండర్లు. నిందితుడ్ని పోలీసులకు పట్టించారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
బంగాల్‌కు చెందిన ఓ యువతి.. ఉద్యోగం వెతుక్కుంటూ బెంగళూరు వచ్చింది. నగరంలోని ఓ చోట గది అద్దెకు తీసుకుని ఉంటోంది. బంగాల్‌కు చెందిన మసూరల్ షేక్.. ఆ యువతి ఒంటరిగా ఉంటోందని గుర్తించాడు. కొద్దిరోజులుగా ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 2న ఉదయం 4 గంటలకు ఆ యువతి ఇంటికెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తెరిచేలోగా ఆమెను పట్టుకుని, అత్యాచారం చేయబోయాడు. యువతిని లోపలకు తోసి, డోర్ వేసేశాడు. వదిలేయమని ఎంత ప్రాధేయపడినా అతడు మాట వినలేదు.