Murder of Mother and Daughter: అబ్బాయి బ్యాంకులో పని చేస్తున్నాడు. దీంతో వాళ్ల అమ్మాయిని ఎంతో మంచిగా.. ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడని అనుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అనుకున్న విధంగానే రోజుల్లోనే ఆ బ్యాంకులో పని చేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్లిద్దరికీ ఈ నెల ఒకటవ తేదీన కుమార్తె వాళ్ల ఇంటి దగ్గరే పెళ్లి అయింది. తమ కుమార్తె పెళ్లి అంతా సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగినందుకు.. ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు.
కాగా ఈ రోజు తమ కుమార్తెను అత్తవారింటికి తీసుకొచ్చారు. కుమార్తెతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించాయి.. ఏదో గొడవ జరుగుతుందని ఇరుగు పొరుగు వాళ్లు అనుకున్నారు.. కానీ వాళ్లకు కూడా ఏం జరుగుతుందో సరిగ్గా తెలియలేదు.
తీరా కొద్ది క్షణాల్లో.. వాళ్లకు తెలిసేలోపే ఘోరం జరిగిపోయింది. కట్టుకున్న భర్త శ్రావణ్.. భార్యను, భార్య తల్లిని అత్యంత కిరాతకంగా చంపేశాడు.. ఇంత జరుగుతున్నా.. శ్రావణ్‌ను తల్లిదండ్రులు అస్సలు ఆపలేదు. తమ కుమారుడు చేస్తున్నది తప్పు అని మందలించాల్సిన వాళ్లే.. అతనికి సహకరించారు.