Mumbai Airport Accident: ముంబయి విమాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి జామ్‌నగర్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్ఇండియా విమానానికి అనుసంధానమై ఉన్న పుష్బ్యాక్ టగ్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలను చేపట్టారు. ఈ ఘటన సోమవారం ఉదయం 11 గంటలకు జరిగింది.
టేకాఫ్‌కు సిద్ధంగా విమానం.. అంతలోనే రన్‌వేపై మంటలు...
Mumbai Airport Accident: ముంబయి విమానాశ్రయంలో రన్‌వేపై ఉన్న విమానం వద్ద మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
విమాన ప్రమాదం
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ఎయిర్‌పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే మంటలను అదుపు చేశామన్నారు.
ఇదీ చూడండి :ముగ్గురు బాలికలపై రేప్.. తెలిసినవారేనని నమ్మి వెళ్తే...
Last Updated : Jan 10, 2022, 6:11 PM IST