ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వందల మీటర్ల మేర పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
హైదరాబాద్కు చెందిన ఓ బృందం రూపొందించిన రిమోట్ సెన్సింగ్ పరికరంతో 500 మీటర్ల లోతులోని శిథిలాలను గుర్తించవచ్చని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం చాపర్ సాయంతో ఆ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో 'హైదరాబాద్' పరికరం 93 మంది ఎన్టీపీసీ కార్మికులు గల్లంతు..
వరదల కారణంగా గల్లంతైన 93మంది ఎన్టీపీసీ కార్మికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. 39 మంది సొరంగంలో చిక్కుకున్నారని, వారిని చేరుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మంచు చరియలు విరిగిపడి సంభవించే ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. వరదల వల్ల మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
శిథిలాలను తొలగించేందుకు శ్రమిస్తున్న సహాయక బృందాలు శిథిలాలను తొలగించేందుకు శ్రమిస్తున్న సహాయక బృందాలు ఇదీ చూడండి: 'మంచు కురవడం వల్లే జలప్రళయం'