తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఆ కథనాలు'

ఫోన్‌ హ్యాకింగ్‌ అంశంపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్​సభలో ప్రకటన చేశారు. ఫోన్‌ హ్యాకింగ్‌పై ఓ వెబ్‌ పోర్టల్‌లో సంచలనాత్మక కథనాలను ఉద్దేశపూర్వకంగానే ప్రచురించినట్లు పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలా చేసినట్లు ఆరోపించారు.

Ashwini Vaishnaw
ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

By

Published : Jul 19, 2021, 4:07 PM IST

Updated : Jul 19, 2021, 5:10 PM IST

భారత ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఫోన్‌ హ్యాకింగ్‌ అంశంపై కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయని కేంద్రప్రభుత్వం మండిపడింది. ఆయా వార్తలన్నీ నిరాధారమైనవని తేల్చిచెప్పింది. కొందరు కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, పాత్రికేయుల ఫోన్లు హ్యాక్​ అయ్యాయన్న వార్తల నేపథ్యంలో లోక్‌సభలో ఈమేరకు ప్రకటన చేశారు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.

అసాధ్యం

భారతీయులపై నిఘా పెట్టడానికి పెగాసస్​ స్పైవేర్​ను ఉపయోగించినట్లు వచ్చిన మీడియా కథనాలను మంత్రి తోసిపుచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.

గతంలోనూ వాట్సాప్‌ను హ్యాక్‌ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని అశ్వినీ వైష్ణవ్​ పేర్కొన్నారు.

సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్​ హ్యాకే​ చేసినట్లు ఓ మీడియా సంస్థ.. ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇదీ చూడండి:పంజాబ్​లో 'టీ పాలిటిక్స్'​- వివాదానికి తెరపడినట్టేనా?

Last Updated : Jul 19, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details