ఓ పక్షి 185 మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. అప్పుడే టేకాఫ్ అయిన స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగేలా చేసింది. విమానం ఎడమవైపు ఉన్న ఓ ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి మంటలు రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని తిరిగి పట్నా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు.
పక్షి దెబ్బకు విమానంలో మంటలు.. టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా... - స్పైస్‌జెట్ విమానంలో ప్రమాదం
పట్నా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైట్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు అధికారులు.
flight
అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. సిబ్బంది.. ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం వీరిని మరో విమానంలో దిల్లీకి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన స్పైస్‌జెట్ ప్రతినిధులు.. పక్షి ఢీకొనడం వల్ల విమానం ఎడమవైపు ఉన్న ఆ ఇంజిన్ భాగం బాగా దెబ్బతిందని, మూడు బ్లేడ్లు ధ్వంసమైనట్లు తమ ప్రాధమిక పరిశీలనలో తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :అగ్నిపథ్ రిక్రూట్మెంట్.. వాయుసేన కీలక ప్రకటన!
Last Updated : Jun 19, 2022, 2:36 PM IST