UP Bride Death news: కాసేపట్లో ఆమె పెళ్లి. వరుడితో పెళ్లిదండలు కూడా మార్చుకుంది. మూడు ముళ్లు వేయడమే ఆలస్యం. కానీ క్షణాల్లో అంతా మారిపోయింది. పెళ్లికూతురు గదిలోకి వెళ్లగానే తుపాకీ కాల్పుల మోత మోగింది. లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రుల గుండె పగిలింది. పెళ్లి దుస్తులో తమ బిడ్డ రక్తపుమడుగులో శవమై కన్పించింది. ఉత్తర్ప్రదేశ్ మథుర నౌజీల్లోని ముబారిక్పుర్ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది.
ఈ కిరాతక చర్యకు పాల్పడింది ఎవరో తమకు తెలియదని పెళ్లికూతురు కాజల్ తండ్రి ఖుబిరామ్ ప్రజాపతి చెప్పారు. ' జైమాల కార్యక్రమం తర్వాత నా కూతురు గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గదిలోకి దూరి కాల్పులకు పాల్పడ్డాడు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.' అని కన్నీటి పర్యంతమయ్యారు ప్రజాపతి. అయితే, నిందితుడు బాధితురాలికి తెలుసునని, ఇరువురు ప్రేమించుకున్నట్లు సమాచారం. వేరే వ్యక్తితో వివాహం చేసుకుంటుందనే కారణంతో కోపం పెంచుకుని ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.