ఈ మధ్య కాలంలో మొబైల్‌ఫోన్లలో వచ్చిన వీడియోగేమ్స్ పిల్లలపై ఎంత దుష్ప్రభావం చూపిస్తున్నాయో తెలియజేసే ఘటన ఇటీవల దిల్లీలో జరిగింది. మొబైల్‌గేమ్ ఆడటం కోసం 12 ఏళ్ల బాలుడు ఏకంగా తన తల్లి బంగారు హారాన్ని విక్రయించాడు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఇంటి నుంచి పారిపోయాడు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
ఎక్కడ తెలిసిపోతుందోనని..
దిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతానికి చెందిన బాలుడు కొన్నాళ్లుగా మొబైల్‌ఫోన్‌లో వీడియోగేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్‌లో గెలవాలంటే ఆయుధాలను ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనాల్సి ఉంటుంది. మొదట్లో అడపాదడపా అతడి తండ్రి జేబులో డబ్బులు కొట్టేసి కొనుగోలు చేసేవాడట. ఇటీవల ఆ బాలుడికి భారీ మొత్తంలో డబ్బు అవసరం కావడం వల్ల ఇంట్లో దాచిపెట్టిన తల్లి బంగారు హారాన్ని రూ.20వేలకు విక్రయించేశాడు. అయితే, తన దొంగతనం ఇంట్లో వాళ్లకి ఎక్కడ తెలిసిపోతుందని మంగళవారం ఇంట్లో నుంచి పారిపోయాడు. దిల్లీలో కిలింది ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ రైల్వేస్టేషన్‌లో దిగాడు.