తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరుబావి నుంచి బాలుడు బయటకు.. 104 గంటల ఆపరేషన్​ సక్సెస్​.. హుటాహుటిన ఆస్పత్రికి! - A boy has been rescued

Chhattisgarh borewell operation: ఛత్తీస్​గఢ్​లో బోరుబావిలో పడ్డ బాలుడిని బయటకు తీశారు ఆర్మీ సిబ్బంది. వెంటనే ఆ బాలుడిని ప్రత్యేక అంబులెన్స్​లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. 104 గంటలకుపైగా నిర్వహించిన ఆపరేషన్​ సక్సెస్​ అయింది.

RAHUL SAHU
బోరుబావి నుంచి బాలుడు బయటకు

By

Published : Jun 14, 2022, 10:57 PM IST

Updated : Jun 15, 2022, 10:01 AM IST

Chhattisgarh Borewell Operation: బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహు కోసం ఛత్తీస్​గఢ్​లోని జాంజ్‌గిర్ చంపాలో నిర్వహించిన ఆపరేషన్​ పూర్తయ్యింది. దాదాపు 104 గంటల శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్​లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచారు. అందులో ఒక సీనియర్, ఇద్దరు ఇద్దరు జూనియర్ వైద్యులు ఉన్నారు.

జరిగింది ఇదీ..
శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఆడుకుంటూ.. వెళ్లి బోరు బావిలో పడిపోయాడు రాహుల్. ఈ సంఘటన జాంజ్​గీర్​ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పిహరీద్​ గ్రామంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వెతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే 112కు ఫోన్​ చేసి సమాచారం అందించారు. మరోవైపు, ముఖ్యమంత్రి బఘేల్.. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 15, 2022, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details