పంజాబ్‌లోని లుధియానాలో మినీ ఒలింపిక్స్ క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. యువకులు, పిల్లలతో పాటు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చినా.. తగ్గేదేలా అంటూ సీనియర్ సిటిజన్లు.. శనివారం జరిగిన పరుగు పందేల్లో పాల్గొన్నారు. 100 మీటర్ల రన్నింగ్ రేసులో సురీందర్ శర్మ అనే వృద్ధుడు బంగారు పతాకాన్ని సాధించారు. దాంతో పాటు 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ రేసులో కూడా ఆయన పాల్గొన్నారు. 72 ఏళ్ల వయసు వచ్చినా తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సురీందర్ శర్మ తెలిపారు.
"ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తాను. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటాను. పంజాబ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పోటీలకు వెళ్తుంటాను. ఇప్పటికే చాలా పతకాలు సాధించాను. ముఖ్యంగా నేటి యువతరం తమ శరీర ధారుడ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి" అంటూ సురీందర్ శర్మ చెప్పుకొచ్చారు.