తెలంగాణ

telangana

ETV Bharat / bharat

90ఏళ్ల బామ్మను సాకలేక పెట్రోల్​ పోసి నిప్పంటించిన మనవరాళ్లు - తిరునెవెలి

వృద్ధురాలైన బామ్మను జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనవరాళ్లే ఆమెపై పెట్రోల్​ పోసి నిప్పంటించారు. ఆమెను సాకలేక ఈ దారుణ చర్యకు పాల్పడ్డారు. తమిళనాడు తిరునెల్వేలిలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. ముంబయిలో 18 ఏళ్ల యువతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడే ఆమెను చంపి శవాన్ని సంచిలో చుట్టి మురుగుకాలువలో పడేసినట్లు వెల్లడించారు.

Granddaughters Killed Grandma
90ఏళ్ల బామ్మను సాకలేక పెట్రోల్​ పోసి నిప్పంటించిన మనవరాళ్లు

By

Published : May 6, 2022, 3:46 PM IST

Granddaughters Killed Grandma: తమిళనాడు తిరునెల్వేలి జిల్లా పెట్టాయ్​లో సొంత బామ్మనే కడతేర్చారు ఇద్దరు మనవరాళ్లు. 90 ఏళ్ల వృద్ధురాలైన ఆమెను సాకలేక ఈ దారుణ చర్యకు పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మే 3న ఆధాం నగర్​ రోడ్డు డంపింగ్ యార్డులో ఓ కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి శవాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అది ఓ వృద్ధురాలి మృతదేహం అని ఖరారు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు ఆధాం నగర్​ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పరీశీలించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఓ ఆటో డ్రైవర్​ను ఫుటేజీలో గుర్తించారు. అతడ్ని స్టేషన్​కు తీసుకెళ్లి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మృతదేహం సుబ్బమ్మ​ది అని, ఆమెను చూసుకునే మనవరాళ్లు మేరి, మరియమ్మే నిప్పంటించి హతమార్చినట్లు తెలిసింది.

Tirunelveli news: వృద్ధురాలి బాగోగులు చూసుకోవడం భారంగా మారిందనే ఇద్దరు మనవరాళ్లు ఆమెను చంపారని పోలీసులు వెల్లడించారు. ఆమెను ఆధాం నగర్​ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారని పేర్కొన్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇద్దరినీ రిమాండ్​కు తరలించారు. సొంత మనవరాళ్లే తమ బామ్మను దారుణంగా చంపారని తెలిసి స్థానికులు షాకయ్యారు.

Sonam Shulka Murder: మహారాష్ట్ర ముంబయిలోని గోరెగావ్​లో 18 ఏళ్ల యువతి మృతదేహం ఓ సంచిలో బీచ్​కు కొట్టకురావడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడ్ని అరెస్టు చేశారు పోలీసులు. యువతి ప్రియుడే ఆమెను హతమార్చినట్లు వెల్లడించారు. అనంతరం శవాన్ని సంచిలో పెట్టి మురుగుకాలువలో పడేసినట్లు వివరించారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మృతురాలు సోనం శుక్లా, బేకరీ షాపు జయమాని మహమ్మద్​ అన్సారీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమె నీట్​ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. ఏప్రిల్​ 24 సాయంత్రం క్లాస్​ కోసమని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రయినా తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పింది. కానీ రాత్రి 11:30 అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే సోనమ్​ క్లాస్​కు అని చెప్పి బాయ్​ఫ్రెండ్ అన్సారీ ఇంటికి వెళ్లింది. రాత్రి 9 గంటలకు అతని ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో ఇంట్లో వాళ్లిద్దరే ఉన్నారు. ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అన్సారీ తీగతో సోనమ్​ గొంతునులుమి హత్య చేశాడు. అనంతరం శవాన్ని సంచిలో తీసుకెళ్లి మురుగుకాలువలో పడేశాడు. ఏప్రిల్ 28న యువతి మృతదేహం బీచ్​లో లభించింది. పోలీసులు అన్సారీని అరెస్టు చేశారు.

చనిపోయిన యువతి ఫొటో

ఇదీ చదవండి:అవతార్​ 'పండోరా'ను మరిపించే అద్భుత ప్రపంచం.. మన దేశంలోనే..

ABOUT THE AUTHOR

...view details