తెలంగాణ

telangana

ETV Bharat / bharat

73 ఏళ్ల బామ్మకు వరుడు కావాలట- షరతులు ఇవే!

ఒంటరిగా ఉండటం ఏ వయసు వారికైనా నరకప్రాయం. దానిని జయించాలనుకుంది కర్ణాటకకు చెందిన ఓ వృద్ధురాలు. వివాహానికి వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. ఇంతకీ ఆమె షరతులు ఏంటో చూడండి.

73 years old woman needs a groom: Granny gives advertisement!
బామ్మకు వరుడు కావాలట.. షరతులు ఇవే!

By

Published : Mar 30, 2021, 10:47 AM IST

కర్ణాటకలోని మైసూర్​లో పెళ్లి చేసుకోవడానికి ఓ వరుడు కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చింది ఓ వృద్ధురాలు. తన ఫోన్​ నెంబర్​ ఇచ్చి, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని చెప్పింది. "నాకు 73 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొందాను. నాకు ఆరోగ్యవంతమైన, బ్రాహ్మణ వరుడు కావాలి. నాకన్నా మూడేళ్లు పెద్దవాడై ఉండాలి. ఆసక్తి ఉంటే సంప్రదించండి." అని ప్రకటనలో పేర్కొంది బామ్మ.

వృద్ధురాలి ప్రకటన

"నాతో సమయం గడపడానికి ఓ భాగస్వామి కావాలి. చట్ట ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అందులో తప్పేముంది?"

-బామ్మ

అంతకుముందు తన మొదటి పెళ్లి బంధం విడాకులతో ముగిసిందని ఆ బామ్మ చెప్పింది. అప్పటినుంచి తన తల్లిదండ్రులతో ఉండగా, వారు కాలం చేసిన తర్వాత ఒంటరిగా చాలా భయంగా ఉండేదని వివరించింది.

అయితే బామ్మ ప్రకటనకు మంచి స్పందనే లభిస్తోంది. ఇప్పటికే కొందరు వృద్ధులు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఈ సరస్సులో మునిగారో.. తేలేది శవంగానే!

ABOUT THE AUTHOR

...view details