తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడు పదుల వయసులోనూ.. డ్రైవింగ్​పై బామ్మకు తగ్గని ఆసక్తి

grand mother driving licenses: విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పలువురి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది ఓ వృద్ధురాలు. ఏడు పదుల వయస్సు దాటినా ఎంతో హుషారుగా తనకిష్టమైన పనిని చేస్తోంది. ఏదైనా సాధించడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. 72 ఏళ్ల వయసులోనూ 11 లైసెన్స్​లు ఆమె చేతిలో ఉన్నాయి. ఈమె కేరళలోని ఎర్నాకులం జిల్లాకి చెందిన బామ్మ.

Indian Grandma Radhamani
అంత వయసులోనూ.. డ్రైవింగ్​పై బామ్మకు తగ్గని ఆసక్తి

By

Published : Mar 14, 2022, 10:28 PM IST

72 ఏళ్ల వయసులోనూ బామ్మకు డ్రైవింగ్​పై తగ్గని ఆసక్తి

grand mother driving licenses: ఆమె స్టీరింగ్ పట్టారంటే ఏ వాహనాన్నైనా అలవోకగా నడుపుతారు... డ్రైవింగ్ స్కూల్​లో వందల మందికి కారు నడపటం నేర్పుతారు... జేసీబీలు, క్రేన్లను కూడా పరుగులు పెట్టించగలరు... ఆమె పేరే రాధామణి. వయసు 72 ఏళ్లు. అయితేనేం 11 లైసెన్స్​లు ఆమె చేతిలో ఉన్నాయి. విమాన పైలట్, లోకో పైలట్ మినహా అన్ని లైసెన్స్​లు​ పొందారు. వయసు సహకరించకపోవడం వల్లే గానీ.. లేదంటే ఆ రెండు లైసెన్స్​లు కూడా సంపాదించేదాన్నని అంటున్నారు.

రాధామణి డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్

కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన రాధామణిని స్థానికులు మణమ్మ అని ముద్దుగా పిలుస్తారు. ఈమె కొచ్చిలోని తోప్పంపాడిలో డ్రైవింగ్ స్కూల్​ను నడుపుతున్నారు. ఈ స్కూల్​ను నడపాలంటే తనకి అన్ని వాహనాల వచ్చి ఉండాలని.. ద్విచక్ర వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాలు, భారీ మోటారు వాహనాలు, జేసీబీలు, క్రేన్లు, ట్రైలర్‌లు, రోడ్ రోలర్‌ను నడపడం నేర్చుకున్నారు.

వాహనాన్ని నడుపుతున్న రాధామణి

1991లో భర్త ప్రోత్సాహంతో మణమ్మ కారును నడపడం నేర్చుకున్నారు. ఆ సమయంలో గ్రామస్థులు హేళన చేసేవారు. అయినప్పటికీ పట్టించుకోకుండా పట్టుదలతో డ్రైవింగ్ నేర్చుకున్నారు. కేరళలో హెవీ డ్రైవింగ్ ఇన్​స్టిట్యూట్​లు ఉండేవి కావు. ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి ఇప్పుడు తనే ఒక హెవీ డ్రైవింగ్​ ఇనిస్టిట్యూట్​ని నడుపుతున్నారు.

వాహనాన్ని నడుపుతున్న రాధామణి

తాను నడిపిన వాహనాల్లో జేసీబీ చాలా కష్టంగా అనిపించిందని రాధామణి తెలిపారు. మహిళలను డ్రైవింగ్​ రంగంలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని అంటున్నారు. ఈ రంగంలో మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇదీ చదవండి:సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్​గానే..

ABOUT THE AUTHOR

...view details