ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. అంతకు రెండు రోజుల మందే ఆ చిన్నారి కనిపించకుండా పోయింది.
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య - ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక.. ఓ బావిలో శవమై తేలింది. పోలీసుల దర్యాప్తులో చిన్నారిని రేప్ చేసి, హతమార్చినట్లు తేలింది.
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
బాలోదా జిల్లా పౌసరి గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ బాలిక అపహరణ కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని గ్రామంలోని ఓ బావిలో వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం.. చిన్నారిని అత్యాచారం చేసి, హతమార్చినట్లు పోలీసులు నిర్ధరించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చూడండి:గర్భిణీని బంధించి.. పిల్లల ముందే అత్యాచారం