Gang rape in odisha: ఒడిశా కేంద్రపడలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. అంగుల్‌లోని జువైనల్ అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.
ఏడేళ్ల బాలికపై మైనర్లు సామూహిక అత్యాచారం.. తీవ్రంగా హింసించి..
Gang rape in odisha: ఏడేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో జరిగింది.
gang rape in odisha
సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక పాఠళాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే బాలికను గమనించిన ఆరుగురు నిందితులు.. బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెను కొట్టి అత్యాచారం చేశారు. ఈ విషయం బయటపెడితే చంపేస్తామంటూ బెదిరించారు. ఇంటికి వచ్చిన బాలిక తన తల్లికి చెప్పడం వల్ల ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి:స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసులు! మరో విమానంలోనూ సాంకేతిక సమస్య