ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వృత్తివిద్య కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. దానికి ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే కూడా మద్దతు పలకగా బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
దీంతో ఇంజనీరింగ్, ఫిషరీస్, లా, వెటరినరీ సహా పలు వృత్తి విద్య కోర్సుల్లో చేరేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రిజర్వేషన్ లబ్ధి పొందనున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడగానే నియమించిన రిటైర్డ్ జస్టిస్ డి. మురుగేషన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.