దేశంలో కొవిడ్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే కొత్తగా 62, 097 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్‌తో మరో 519 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షల 60 వేల 359కు చేరింది. ఒక్క ముంబయిలోనే 7,214మందికి కరోనా నిర్ధరణ అయింది.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 29,754 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు సైతం ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఒక్కరోజే 167 మంది వైరస్‌కు బలయ్యారు.
- దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 28,395 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి 277 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కేరళలో రికార్డు స్థాయిలో కొత్తగా 19,577 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావానికి మరో 28 మంది మరణించారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 12, 201 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ కారణంగా మరో 64 మంది మరణించారు.
- తమిళనాడులో కొత్తగా 10,986 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 48 మంది మరణించారు.
- ఉత్తరాఖండ్‌లో కొత్తగా 3,012 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్‌తో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
- హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా 1,340 మందికి కరోనా సోకింది. మహమ్మారి కారణంగా మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంక్షల బాట..