శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో 56 రోజుల సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర(Amarnath yatra 2021) ముగిసింది. హిమలింగ రూపంలో గుహలో కొలువైన ఈశ్వరుడి చెంతకు చారీ ముబారక్ చేరుకోవడం వల్ల.. ఆలయాధికారులు, పండితులు, సాధువులు ఘనంగా సమపన్ పూజను నిర్వహించారు.
Amarnath yatra 2021: ముగిసిన సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర
56 రోజుల సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర(Amarnath yatra 2021) ముగిసింది. చారీ ముబారక్ ఈశ్వరుడి చెంతకు చేరుకోవడం వల్ల.. ఆలయ అధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు.
జూన్ 28న సంప్రదాయబద్దంగా యాత్రను ప్రారంభించిన శ్రీ అమర్‌నాథ్‌జీ (Amarnath yatra 2021) పుణ్యక్షేత్రం బోర్డు.. ఆనవాయితీగా వస్తున్న ఆచారాల్ని, క్రతవుల్ని పాటిస్తూ రక్షాబంధన్ రోజున సంప్రదాయ ముగింపు పూజ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించింది. కొవిడ్ 19 దృష్ట్యా సామాన్య భక్తులకు ఈ యాత్రకు అవకాశం లేకపోవటంతో టీవీ ఛానెల్‌లు, సామాజికమాధ్యమాల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యక్ష ప్రసారాలను శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి:ఆ పార్టీ నేతలకు ఇన్నోవా కార్లు గిఫ్ట్!